కేంద్ర సాహిత్య అకాడమి, అధ్వని రైటర్స్‌ ఫోరమ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9న మహబూబ్‌నగర్‌ పట్ఠణంలోని మొట్టుగడ్డలోని లిటిల్‌ స్కాలర్స్‌ హై స్కూల్‌ ప్రాంగణంలో గల కాళోజహల్‌లో వలస సాహిత్యంపై ఒక రోజు సాహిత్య సదస్సును నిర్వహించనున్నట్లు నిర్వాహకులు జలజం సత్యనారాయణ, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. బుధవారం రోడ్లు భవనాల అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సు వివరాలను వెల్లడించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సాహిత్య సదస్సును ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఉదయం ప్రారంభోత్సవ సమావేశానికి కేంద్ర సాహిత్య అకాడమి ప్రాంతీయ కార్యదర్శి ఎస్‌. పి. మహాలింగేశ్వర్‌ స్వాగతం పలుకుతారని, సాహిత్య అకాడమి తెలుగు సలహ మండలి సంచాలకులు ఎన్‌. గోపీ అధ్యక్షత వహిస్తారన్నారు. అలాగే ముఖ్య అతిథిగా పాలమూరు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా బి. రాజారత్నం విచ్చేస్తారని తెలంగాణ ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ కీలకోపన్యాసం ఉంటుందన్నారు. మొదటి సదస్సుకు గుడిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహిస్తారన్నారు. పాలమూరు కథలు – వలస బతుకులుపై గుంటి గోపీ, అద్య కవిత్వం పాలమూరు గోసుపై పల్లెర్ల రాంమోహన్‌రావు, పాలమూరు మనన సాహిత్యం వలస వివరణపై కొల్లాపురం విమల పత్ర సమర్పణ చేస్తారన్నారు. మధ్యాహ్నం జరిగే రెండవ సదస్సుకు జాకంటి జగన్నాథం అధ్యక్షత వహి స్తారన్నారు. పాలమూరు నవలలు వలసజీవన చిత్రణపై జె. నీరజ, పాలమూరు క విత్వం వలస వేదనపై భీంపల్లి శ్రీకాంత్‌ , పాలమూరు పాటలు వలస ల వలపోతపై పి. భాస్కరయోగి పత్ర సమర్ధణ చేస్తారన్నారు. ముగింపు సమావేశానికి ఎన్‌.గోపీ అధ్యక్షత వహిస్తారని, ప్రముఖ పరిశోధనలు ఆచార్య ఎస్వీ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు.
అనంతరం ప్రముఖ తెలుగు కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవిసంధ్య ఉంటుందని, ఈ కవి సంధ్యలో కవితన కవితంను వినిపిస్తారన్నారు. కావున ఈ సాహిత్య సదస్సు కు జిల్లాలోని కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి