కవులు ధిక్కార స్వరాలను వారే సమాజపు దుర్నీతిని ప్రశ్నిస్తారని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ కేంద్రంలో అనంత లక్ష్మీనర్సింహ్మా గార్డెన్‌లో నిర్వహించిన జిల్లా మహాసభలకు ఆ యన విచ్చేసి ప్రసంగించారు. తెలంగాణ రాష్ర్ట అవిర్భావం అనంతరం కూడా తెలంగాణ సంస్కృతి, సాహిత్యం అస్తిత్వంపై విపరీతమైన దాడి జరుగు తున్నదని విమర్శించారు. వీటిని తిప్పికొట్టడంలో తెరవే తన పాత్రను సముచితంగా కొనసాగిస్తుందన్నారు. తెరవే రాష్ర్ట అధ్యక్షులు ఆచార్య జయ ధీర్ తిరుమ రావు మాట్లాడుతూ.. స్థల కాలాలను బట్టి సాహిత్యాన్ని అధ్య యనం చేయవలసిన అవసరం ఉందన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులు జల జం సత్యనారాయణ మాట్లాడుతూ.. కవులు ప్రభుత్వం దృష్టికి రాని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొనివచ్చి ప్రయత్నించే దిశగా తెరవే ప్ర యత్నం చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట సాధనలో కవుల పాత్ర అమోఘమైందన్నారు. ప్రస్తుతం ప్రజల వైపు నిలుపబడి పోరాడుతున్న చరిత్ర కవుల దన్నారు. అనంతరం ఆచార్య ఎస్వీ రామారావు తెలంగాణ సాహిత్య నిర్మాణంపై ప్రసంగించారు.
కాలనాళిక తెలంగాణ కవితా సంకలనం ఆవిష్కరణ:
తెలంగాణ కవితా సంకలనం ‘కాలనాళిక’ను జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణలోని 10 జిల్లాల కవుల కవితలు ప్రచురించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వి. మనోహ ర్‌రెడ్డి, డాక్టర్ మధుసూధన్‌రెడ్డి, బెక్కం జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
సాహిత్య ఉద్దండులకు సన్మానం
పాలమూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన సాహిత్య పరిశోధకులు డాక్టర్ కపి లవాయి లింగమూర్తి, డాక్టర్ ఉందేకోడు రత్నయ్యలను జస్టిస్ బి. సుద ర్శన్‌రెడ్డి శాలువా, మెమోంటోలతో సత్కరించారు. అనంతరం రెండవ సమావేశంలో తెలంగాణ సామాజిక సాహిత్యం, సంస్కృతిక రంగం అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన ఆచార్య గూడూరు మనోజ మాట్లాడుతూ దశాబ్దాలుగా తెలం గాణ భాష వివక్షతకు గురైందన్నారు. ప్రధాన వక్త గుడిపాటి మాట్లాడుతూ.. తెలంగాణ భాషలోనే కవులు రచయితలు రచనలు చేయాలన్నారు. తెలం గాణ భాషా సాహిత్యాలకు ప్రభుత్వం తెలంగాణ సాహితీ అకాడమీని నెల కొల్పాలన్నారు. అలాగే తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ను ఏర్పాటు చేయ్యా లన్నారు. విశిష్ట అతిథి బుర్రి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న ఇతర భాషాపదాలను తొలగించి తెలంగాణ భాషపదాలనే రచయితలు ఉప యోగించాలన్నారు. అత్మీయ అతిధి బెక్కం జనార్ధన్ మాట్లాడుతూ .. పాలమూరు జిల్లా ఆర్థికంగా వెనుకబడిన సాహిత్యపరంగా ముందు వరుసన ఉందన్నారు. అనాటి సురవరం మొదలుకొని ఈనాటి గోరటి వెంకన్న వరకు ప్రసిద్ధ కవులు ఉన్న జిల్లా ఇది అన్నారు. అనంతరం జరిగిన మూడవ సమావేశంలో తెరవే జిల్లా ప్రధాన కార్యదర్శి డా॥ భీంపల్లి శ్రీకాంత్ సభా ధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవులు ప్రజాపక్షం వహిస్తూ సమాజంలోని అసమానతలు ప్రశ్నిస్తూ ఉంటారన్నారు. ప్రధాన వక్త డా॥బెల్లి యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ భాషను, యాసను కవులు తమ కవిత్వంలోకి ఒంపాలన్నారు. ముగింపు సమావేశానికి తెరవే రాష్ర్ట అధ్యక్షులు ఆచార్య జయధీర్ తిరుమలరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధి కేంద్ర సమాచార కమిషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణకై చైతన్యవంతంగా పోరాడామో ఆదే విధంగా తెలంగాణ రాష్ర్టం వచ్చిన తరువాత ప్రజా సమస్యలకై చైతన్యవంతంగా పోరాడాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను రచయితలు ఎప్పటి కఫ్పుడు నిశితంగా పరిశీ లించాలన్నారు. ఉమ్మడి హైకోర్టును విభజించాలన్నారు.
అనంతరం కిన్నెర కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్య క్రమంలో డాక్టర్ గుంటిగోపి, ఎన్. సుభాషిని, జనజ్వాల, గోపినాథ్ రాథోడ్‌‌, డి.అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


డాక్టర్ శ్రీకాంత్  March 5, 2016 దక్కన్ ల్యాండ్ పత్రికలోని వ్యాసం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి