*తెలంగాణ తొలి నవల ఆశాదోషం ఆవిష్కరణ*


తెలంగాణ తొలితరం కథా రచయిత, హితబోధిని పత్రికా సంపాదకులు అయిన బరార్ శ్రీనివాసశర్మ రచించిన తెలంగాణ తొలి నవల ఆశాదోషం ను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కోయిలకొండ దుర్గ చరిత్రను రచయిత నవలగా రచించారు.వందేళ్ల క్రితం రచించిన ఈ నవలను ప్రముఖ తాళపత్ర సేకర్త,పరిశోధకులు నాగలింగ శివయోగి వెలుగులోకి తెచ్చారు. దీనికి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సంపాదకత్వం వహించగా, హేరూర్ శోభా విజయకుమార్ సహసంపాదకులుగా వ్యవహరించారు. హేరూర్ విజయకుమార్ దీనిని ప్రచురించారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు,తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, డాక్టర్ జె.చెన్నయ్య,తెలంగాణ క్రీడల సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, సంపాదకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, సహసంపాదకులు హేరూర్ శోభావిజయకుమార్,హేరూర్ విజయకుమార్, హేరూర్ రాజేష్, పోరెడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి