అందమో కాదో
అంత్ణ సౌందర్య మో
బాహ్య సౌందర్య మో
మనసో కాదో
కళ్లల్లో కళ్లు
రెటినాపై చిత్రాలో
బాషకందని భావాలో
మనలో
నడయాడిన ఘడియల్లో
ఉద్భవించే ప్రక్రియకి
ప్రత్యామ్నాయ పేరు
ప్రేమనుకుంటే
తేనెలొలికే
క్షణాల కణాల
మేళవింపే
మనసూదే బాకా
పరిమళాలు వెదజల్లే
మల్లెపందిరి
మనం అల్లుకున్న ఆశల సౌధం
బలమైన పునాదిగా
- గిరిప్రసాద్‌ చెలమల్లు-9493388201
రుబాయిలు
పూజ కోసం పువ్వులు ఎదురుచూస్తూంటాయి 
పువ్వుల కోసం తుమ్మెదలు అన్వేషిస్తూంటాయి 
నిరీక్షణ ఒక విరహ వేదన 
నీ ప్రేమ కోసం కన్నులు కాస్తూంటాయి 

చెలియ చిరునవ్వుకే దాసోహమవుతాను 
తియ్యని పలుకులకే పులకించిపోతాను 
తెలియని అనుభూతేదో మనసును తాకింది 
చిలుకపలుకులు పలికితేనే పరవశించిపోతాను 

దూరమవుతూనే దగ్గరవుతుంటావు నువ్వు 
కనిపించకుండానే కల్లోకి వస్తూంటావు నువ్వు 
విరహం ప్రేమకు పరీక్ష 
ప్రేమలా మాయమవుతుంటావు నువ్వు 

నవ్వుతూ ఉంటావు ఎప్పుడూ అందంగా 
నవ్విస్తూనే ఉంటావు మకరందం చందంగా 
నవ్వేకదా ఔషధం ప్రతి మనిషికి 
నవ్విస్తూ ఉండాలి ఎల్లప్పుడూ ఆనందంగా 

- డా.భీంపల్లి శ్రీకాంత్‌, 9032844017  Jan 22,2017 నవ తెలంగాణ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి