చినుకు కోసం భూమి ఎదురుచూస్తూ ఉంటుంది
నీ కోసం మనసు పలవరిస్తూ ఉంటుంది 
నువ్వే లేకపోతే నేనేమిటి ప్రియా
నీ పిలుపు కోసం హ దయం తపిస్తూనే ఉంటుంది

ఎక్కడ వెతకగలను నీ జాడ కోసం
ఎక్కడ వినగలను నీ పిలుపు కోసం
కనిపిస్తూనే మాయమవుతుంటావు నువ్వు
ఎక్కడ చూడగలను నీ నవ్వు కోసం

కోయిల రాగమే మనసుకు ఆనందనందనం
నీ చిరుపలుకులే మనసుకు 
రాగనందనం
సరిగమలే సంగీతానికి ఆయువుపట్టు
నీ నవ్వులే నాకు వెలలేని మాగాణం

నువ్వు వెళ్ళిపోగానే చీకటయ్యింది మనసు
నువ్వు లేవనే మూగవోయింది మనసు
ఒంటరై పోవడం విషాదమే ప్రియా
నువ్వు లేకపోవడం వియోగమయ్యింది మనసు

నీ కోసం ఎన్ని కన్నీళ్లను రాల్చగలను
నీ కోసం ఎన్ని రోజులు చూడగలను
ఎదురుచూడడంలోనే ఎంతో ఆనందం
నీ కోసం ఎన్ని కాలాలు ఒడిసి పట్టగలను

-భీంపల్లి శ్రీకాంత్‌, 9032844017 Sat 09 Sep 2017  నవతెలంగాణ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి