వేడుకగా ఎదిర చెన్నకేశవులు పురస్కారాల ప్రదానోత్సవం  మహబూబ్‌నగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే : జిల్లాలో అపూర్వ సాహితీ సంపద ఉన్నదని, ఎంతోమంది కవులు ఈ రంగంలో కృషి చేసి జిల్లాకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టారని ప్రముఖ కవి డా.మసన చెన్నప్ప అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డలోని కాళొజీ హాలులో తెలంగాణ తొలితరం రచయిత ఎదిర చెన్నకేశవులు శతజయంతి ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మసన చెన్నప్ప మాట్లాడారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా నడిచిన గొల్కొండ పత్రికలో ఎన్నో సంపాదకీయ వ్యాసాలను చెన్నకేశవులు రాశారని గుర్తు చేశారు. నవల, కథానిక, కథ, కవిత్వం లాంటి భిన్నమైన సాహిత్య ప్రక్రియల్లో తనదైన ముద్ర వేశారని చెన్నకేశవులు ప్రతిభను కొనియాడారు. న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి, జలజం సత్యనారాయణ మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో ఇలాంటి కవి ప్రముఖులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సాహిత్య రంగానికి కృషి చేసిన కమలేకర్‌ డాగోజిరావు, పాత్రికేయరంగం నుంచి బైంస దేవదాసు, చేనేత రంగం నుంచి తడక యాదగిరిలకు ఎదిర చెన్నకేశవులు పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో తహశీల్దారు ప్రభాకర్‌రావు, డా.భీంపల్లి శ్రీకాంత్‌, చెన్నకేశవులు మనుమడు మేక రవీంద్ర, గుముడాల చక్రవర్తిగౌడ్‌, కమలేకర్‌ శ్యాంప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 16 Aug, 4.09 am

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి