ఆకుపై నాట్యమాడే చినుకుదెంత చరితం
పెంచుపై ఆవిరయ్యే క్షణభంగుర జీవితం
చిటపట చినుకులే జీవితాన జ్ఞాపకాలు
అలలా వచ్చిపోయే చిరుజల్లే జీవితం

దేశసేవలో తరిస్తున్న వీరులకు అభివందనం
పహరా కాస్తూ పరిరక్షిస్తున్న సైనికులకు వందనం
సైనికులే లేకపోతే దేశభవిత ప్రశ్నార్థకం
నిత్యజాగరణ చేస్తున్న ధీరులకు వీరవందనం

పల్లె అంటే ఎప్పటికీ పరిమళాల పువ్వులు
నగరమంటే ఎన్నిటికీ ఆరిపోయే నవ్వులు
బతుకంటేనే సుఖదుఃఖాల సమ్మేళనం
జీవితమంటే వికసించే ఆత్మీయ నవ్వులు

- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, 9032844017  
 నమస్తే  తెలంగాణ  Mon,January 9, 2017 01:50 AM 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి